ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో.. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ చావు దెబ్బ తీసింది. బీరూట్‌పై జరిగిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ IDF సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
Hezbollah: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు.