ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.