చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురిశాయి. హెనన్ ప్రావిన్స్‌లోని జెంగ్జౌ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ…