Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు..
- ప్రమాదంలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం..
- దాడులు చేయొద్దని హెచ్చరించిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి వల్ల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే స్థాయికి వెళ్లిందని ఇరాన్ ఫైర్ అయింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్‌పై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్చలే ఉత్తమ మార్గమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ అన్నారు.
ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి దగ్గరలో ఉన్నప్పుడు, ఈ ఉదయం బీరూట్‌పై దాడి జరగాల్సింది కాదని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని ట్రంప్ చెబుతూనే, ఈ దాడి చాలా చిన్నదని పేర్కొన్నారు. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని లేదా గాయపడలేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెబనాన్‌పై ఇకపై ఎలాంటి దాడులు జరగకూడదని ట్రంప్ ఇజ్రాయిల్‌కు తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్‌పై దాడుల చేయవద్దని హిజ్బుల్లాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందాన్ని నాశనం చేయొద్దని అన్నారు.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
లెబనాన్‌పై జరిగిన దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సైన్యం డిప్యూటీ కమాండర్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ చర్యలకు తప్పకుండా జవాబు ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్‌లోని దహియా ప్రాంతంపై భారీ దాడి చేసింది. హిజ్బుల్లా మొదట ఉత్తర ఇజ్రాయిల్‌పై దాడి చేసిందని, అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!