CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- కృష్ణానదిలో పడవ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ నుంచి పల్నాడు కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- ఎక్స్‌గ్రేషియా తక్షణమే అందించాలని పల్నాడు కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : పల్నాడు జిల్లా కోనూరు వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన, ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడి నుంచే పల్నాడు జిల్లా కలెక్టర్ , ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పడవ నదిలోని ఇసుక దిబ్బను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని, ఇందులో నలుగురు మృతి చెందగా మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గంధం శైను, గంధం సంధ్య, బత్తుల కార్తీక్, కాంతం చైతన్యల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబాలకు తక్షణమే అందజేయాలని పల్నాడు కలెక్టర్‌ను ఆదేశించారు. నది నుంచి వెలికితీసిన మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారుల బృందంతో పూర్తి స్థాయి విచారణ జరిపించి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ ఘోరాలు పునరావృతం కాకుండా నదీ తీరాల్లో కఠినమైన రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై తదుపరి సహాయక చర్యలు, సమన్వయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక అధికారి ప్రఖర్ జైన్, సమాచార పౌరసంబంధాల విభాగం డైరెక్టర్ విశ్వనాథ్ , జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలను అప్పగించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..