క్రికెట్ మ్యాచ్ ఆడుతూ పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ మరణించాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరిగింది. మరణించిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ జునైద్ జాఫర్ ఖాన్ వయస్సు 40 సంవత్సరాలు పైబడి ఉంది. జునైద్ క్లబ్ స్థాయి ఆటగాడు. అతను మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. ఉష్ణోగ్రత 41.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది.
ఈ ఏడాది హజ్ యాత్రలో అనారోగ్యం, గరిష్ట ఉష్ణోగ్రతలు తదితర కారణాల వల్ల సుమారు 1300 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో ఈసారి హజ్యాత్రకు భక్తులు తరలివచ్చారు. గతేడాది 16 లక్షల మంది వస్తే ఈ ఏడాది 18 లక్షల మంది వరకు వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవడం తో 50 డిగ్రీలపైగ ఎండలు హజ్ యాత్రికులకు శాపంగ మారింది మరణించిన ప్రతి 5 మందిలో 4 మంది…
Heatwave: ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు, ఉష్ణోగ్రతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జూన్ మాసం చివరికి వచ్చినా కూడా ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వేడి తీవ్రత తగ్గలేదు.
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.