Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. పలు రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.. రేపు 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని సంచలనం.. గెలిపించే బాధ్యత వాలంటీర్లదే..! తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల విషయానికి వస్తే..…