ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ టైం తీసుకోకుండా... ఏపీలో మొదలైన పొలిటికల్ హీట్ ఇప్పుడు పీక్స్‌కు చేరుతోంది. అంటుకున్న మంట మీద కాస్త నకిలీ మద్యం పడేసరికి ఇక భగ్గుమంటోంది. ఇక్కడే పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోందట ప్రతిపక్షం వైసీపీ. కేవలం కూటమి ప్రభుత్వం ద్వారా.. తమ చేతికి అందిన రెండు అస్త్రాలను ఆలంబనగా చేసుకుని ఫుల్ రీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేయాలనుకుంటున్నట్టు సమాచారం.