పేద ప్రజలకు ఆరోగ్యదాయినిగా నిలిచే డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒక్కో కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలను అందించే అపర సంజీవని ఆరోగ్యశ్రీ. క్యాన్సర్ చికిత్సతో పరిమితి లేకుండా ఎంత ఖర్చయినా వెనకాడక ఉచితంగా వైద్య సాయాన్ని అందజేస్తోంది జగన్ సర్కారు.