మనం జనరల్గా కరివేపాకుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు గనుక అలా చేస్తూ ఉంటే… కనీసం కరివేపాకులతో టీ తాగే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత ప్రయోజనాలు అలాంటివి. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. ఇది మన…
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ముఖ్యంగా.. రోజూ కిచెన్లోకి వెళ్లినప్పుడు ఓ రెండు లవంగాలు తీసుకుని అలా నోట్లో వేసుకోండి. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇది ఎంతో లాభదాయకం కూడా.భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.…
సౌందర్య సాధనలో, ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే. భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయల నుండి తీసే కొబ్బరి నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి గింజలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి, మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను…
చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..అవును.. నిజమే.. ఈ టైమ్లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత…
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే… ఆ నొప్పి… అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ… కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి…
ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికి తెలుసు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న చిన్న హెల్త్ టిప్స్ పాటించాల్సిందే. అలా ఆరోగ్యంగా ఉంచే, ఎప్పుడూ మన వంట గదిలో లభించే వాము వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? వాము మంచి ఔషధపు మొక్క. దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.…