వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ముఖ్యంగా.. రోజూ కిచెన్‌లోకి వెళ్లినప్పుడు ఓ రెండు లవంగాలు తీసుకుని అలా నోట్లో వేసుకోండి. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీరు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇది ఎంతో లాభదాయకం కూడా.భారతీయ సాంప్రదాయ వంటకాల్లో విరివిగా ఉపయోగించే సుగంధద్రవ్యాల్లో లవంగం ఒకటి. లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లవంగాలలో ‘నైజీరిసిన్’ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను నివారించడంలో, ఇన్సులిన్ చర్యను మెరుగుపర్చడంలో, నూతన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
Read Also : కొబ్బరి నూనెతో అద్భుతమైన 7 ఆరోగ్య ప్రయోజనాలు
రోజూ రాత్రి భోజనం తర్వాత రెండు లేదా మూడు లవంగాలు తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది శరీరం నుండి అవాంఛిత కొవ్వును తొలగించడానికి కూడా సహాయపడుతుంది. భోజనం తర్వాత లవంగాలను నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను చంపుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి కొవ్వు పెరిగిపోతుందని భయపడకుండా ఈ చిట్కా పాటించండి. నోరు. దుర్వాసన వంటి అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. జలుబు దగ్గుకు లవంగం మంచి మందు. నోట్లో ఒ రెండు లవంగాలు వేసుకొని చప్పరిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో మాంగనీసు పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, ఎముకలు దృఢంగా మారేందుకు లవంగాలు సహకరిస్తాయి.