నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్, ప్రతినిధుల బృందం సందర్శించింది. నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను జాన్ కైపర్స్ బృందం పరిశీలించింది. నిమ్స్ ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు ఈ టీమ్ వచ్చింది.
కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండు మంగళవారాల్లో 11 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
Postpone Bharat Jodo Yatra, Health minister writes to Rahul Gandhi: చైనా, తూర్పు ఆసియా దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. కోవిడ్ తో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎంతలా అంటే అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా సిబ్బంది దొరకడం లేదు. మరణాల సంఖ్య కూడా పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ తో పాటు మరో కీలక నగరం షాంఘైలో కేసులు ఇబ్బదిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి.
ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసులు… మనదేశంలోనూ పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. దేశ రాజధానిలో కొత్తగా మరొకరికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. విదేశీ పౌరుడైన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ వచ్చింది. అతడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా… మంకీపాక్స్ సోకింది. తాజా కేసుతో కలిపి ఢిల్లీలో.. మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. Read…
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019-20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 35 శాతం ఉంటే 2021-22లో 43 శాతం పెరిగాయని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చులు భారం లేకుండా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని జిల్లాలు, ఏరియా…