ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యబీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలోని ఆస్పత్రుల్లోనూ వైద్య సేవలు, చికిత్స పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయనున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు ప్రక్రియను చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.