HCU Case: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల విషయంలో ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఫేక్ వీడియోలు, తప్పుడు ఫోటోలను ప్రసారం చేస్తూ కావాలనే వివాదం సృష్టిస్తున్న దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫేక్ ప్రచారంలో యూనివర్సిటీ భూములను అక్రమంగా ఆక్రమించారని, పర్యావరణాన్ని ధ్వంసం చేశారనీ, వన్యప్రాణులకు నష్టం వాటిల్లిందంటూ ఊహాగానాలు వ్యాప్తి చెయ్యడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా…