(మే 11న హీరో సుధీర్ బాబు బర్త్ డే)హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు…