(జూన్ 22న అమ్రిష్ పురి జయంతి)‘ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు’ అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు పాట్లు పడ్డారు. చివరకు బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు చిత్రాలలో అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించన అమ్రిష్ పురి…