అనితరసాధ్యుడు అమ్రిష్ పురి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 22న అమ్రిష్ పురి జయంతి)
‘ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు’ అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు పాట్లు పడ్డారు. చివరకు బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు చిత్రాలలో అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించన అమ్రిష్ పురి విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ద డూమ్’ చిత్రంలో నటించి అంతర్జాతీయంగానూ పేరు సంపాదించారు. అంతకు ముందు రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’లో ఖాన్ పాత్రలో జీవించీ ఆకట్టుకున్నారు. నున్నటి గుండుతో అనేక చిత్రాలలో నటించిన నటునిగానూ అమ్రిష్ పురి చరిత్ర సృష్టించారు.
అలా అలా…
పంజాబ్ లో జన్మించిన అమ్రిష్ పురి చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ ఉండేవారు. తన అన్నలు చమన్ పురి, మదన్ పురి హిందీ చిత్రసీమలో రాణిస్తూ ఉన్న సమయంలోనే అమ్రిష్ కూడా ముంబయ్ లో అడుగు పెట్టారు. ఆరంభంలోనే స్క్రీన్ టెస్ట్ లో ఆకర్షించలేకపోయాడు. దాంతో పృథ్వీ థియేటర్స్ లో చేరి సత్యదేవ్ దూబే రాసిన నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. నాటకరంగంలో పేరు సంపాదించిన అమ్రిష్ పురికి శ్యామ్ బెనెగల్ చిత్రాలలో మంచి గుర్తింపు లభించింది. అయితే శ్యామ్ సినిమాలన్నీ సమాంతర చిత్రాలు కావడంతో అమ్రిష్ కు కమర్షియల్ బ్రేక్ లభించలేదు. అయినా తనకు లభించిన పాత్రలను పోషిస్తూ ఉండేవారు. తెలుగులో విజయం సాధించిన ‘మనవూరి పాండవులు’ ఆధారంగా హిందీలో బాపు రూపొందించిన ‘హమ్ పాంచ్’ చిత్రంలో వీరప్రతాప్ సింగ్ గా నటించి ఆకట్టుకున్నారు అమ్రిష్. ఆ సినిమా తరువాత అనేక కమర్షియల్ మూవీస్ లో నటిస్తూ తనదైన బాణీ పలికించారు. “విధాత, శక్తి, హీరో” వంటి చిత్రాలలో అమ్రిష్ పురి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆయన నటన కోసమే సినిమాలకు వెళ్ళే రోజులు ఉండేవి. ఇక ‘మిస్టర్ ఇండియా’లో ముగాంబో పాత్రతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. “త్రిదేవ్, ఘాయల్, దామిని” చిత్రాల్లోనూ అమ్రిష్ విలక్షణమైన పాత్రలు పోషించారు. విలన్ గా భయపెట్టడమే కాదు, “దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఫూల్ ఔర్ కాంటే, పర్ దేశ్, విరాసత్, ఘటక్, చీనా గేట్” వంటి చిత్రాలలో పాజిటివ్ రోల్స్ లోనూ అమ్రిష్ పురి అభినయం అలరించింది.
Also Read
తెలుగు సినిమాల్లో…
తెలుగునాట అమ్రిష్ పురి తొలిసారి నటించిన చిత్రం కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఆఖరి పోరాటం’. ఇందులో తన సంభాషణలు తానే చెప్పుకొని ఆకట్టుకున్నారు. అమ్రిష్ పురి తెలుగు పలుకు అంత బాగాలేకపోయినా, అందులోనే ఓ వైవిధ్యం కనిపించింది. అదే తెలుగువారినీ ఆకట్టుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ ‘మేజర్ చంద్రకాంత్’, ‘అశ్వమేధం’లోనూ అమ్రిష్ పురి ప్రతినాయక పాత్రల్లో అలరించారు. ఇక మహానటుడు యన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’లో నటించడం మరపురాని అనుభూతి అని అమ్రిష్ పురి చెప్పారు. బాలకృష్ణతో “ఆదిత్య 369, నిప్పురవ్వ, అశ్వమేధం” చిత్రాలలో నటించారు. చిరంజీవితో “కొండవీటి దొంగ, జగదేకవీరుడు -అతిలోకసుందరి”లో అభినయించారు పురి. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’లో ఆకట్టుకొనేలా నటించారు. తెలుగునాట అమ్రిష్ పురి నటించిన చిత్రాలు కొన్నే అయినా, అవన్నీ బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే కావడం విశేషం.
తెరపై విలన్ గా ఎంతగానో భయపెట్టిన అమ్రిష్ పురి, నిజజీవితంలో ఎంతో సౌమ్యుడు. శాకాహారి, ప్రకృతి చికిత్సతో సాగేవారు. ఎప్పుడూ శరీరాన్ని గట్టిగా ఉంచుకొనడానికి ప్రయత్నించేవారు. సదా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. అందుకే ఆయనతో నటించడానికి సహనటీనటులు సైతం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. అలాంటి అమ్రిష్ పురి నేడు మన మధ్య లేకపోయినా, ఆయన అభినయం కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న అభిమానుల మదిలో సదా నిలచి పోయింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!