ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాపై ఆందోళనకారుల నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. సోమవారం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పరారయ్యారు. దీంతో నిరసనకారులు ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.
నిరసనకారుల ఆందోళనతో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ లేదా లండన్‌కు పారిపోయినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.