Monke Surgery: తొలిసారి కోతికి కంటిశుక్లం శస్త్రచికిత్స.. ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తొలిసారి కోతికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేసి విజయవంతం అయ్యారు. ప్రస్తుతం కోతి తిరిగి చూపు పొందుకోగలిగింది. హిసార్‌లోని లాలా లజపత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వారు ఈ సర్జరీ నిర్వహించారు. ఎల్‌యూవీఏఎస్ ప్రకారం కోతికి మొట్టమొదటిసారిగా కంటిశుక్లం శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Kadapa: కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు.. జిల్లా నుంచి రౌడీషీటర్లు బహిష్కరణ..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఓ కోతి విద్యుత్ షాక్‌తో కంటిచూపు కోల్పోయింది. అలాగే కాళ్లు కూడా కాలిపోయాయి. అనంతరం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన కోతికి ప్రభుత్వ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైద్యులు కంటిశుక్లం శస్త్రచికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ కావడంతో మంకీ కంటిచూపు పొందుకోగలిగింది.
ఇది కూడా చదవండి: Delhi: తీవ్రస్థాయిలో నీటి కష్టాలు.. ట్యాంకర్ రాగానే ఎగబడ్డ జనాలు
ఎల్‌యూవీఏఎస్‌లోని యానిమల్ సర్జరీ మరియు రేడియాలజీ విభాగాధిపతి ఆర్‌ఎన్ చౌదరి మాట్లాడుతూ… విద్యుత్ షాక్ కారణంగా కాలిన గాయాలతో గాయపడ్డ కోతిని హన్సి నివాసి అయిన జంతు ప్రేమికుడు మునీష్… మెడికల్ క్యాంపస్‌కు తీసుకువచ్చారని తెలిపారు. మొదట్లో నడవలేని పరిస్థితి ఉందని.. చాలా రోజుల సంరక్షణ, చికిత్స తర్వాత కోతి నడవడం ప్రారంభించిందని చెప్పారు. కోతికి కంటిచూపు కనిపించడం లేదని వైద్యులు గుర్తించారని.. అనంతరం కంటిచూపు వచ్చేలా సర్జరీ చేసినట్లు RN చౌదరి అధికారిక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ప్రియాంక దుగ్గల్.. యూనివర్శిటీలోని యానిమల్ ఐ యూనిట్‌లో తొలుత కోతిని పరీక్షించారు. ఒక కంటిలోని విట్రస్ కూడా దెబ్బతినడంతో మరో కంటికి ఆపరేషన్ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కోతి పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Remal Cyclone : అస్సాంలో ‘రెమాల్’ తుఫాను..ఐదుగురు మృతి.. 42 వేల మందిపై ప్రభావం
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!