RSS: బీజేపీ, తన మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కలిసి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి హర్యానా గెలుపే నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయలేదని, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందనే ఊహాగానాల నుంచి భారీ గెలుపు దిశగా పయణించింది. వరసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ, తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్…
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్‌లో కూడా బీజేపీ సత్తా చాటింది. ఓడిపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
Haryana Elections: 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానాలో పదేళ్ల పాలన తర్వాత బీజేపీ గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి కాంగ్రెస్‌కి ఘోర పరాభవం తప్పలేదు. ఇదిలా ఉంటే హర్యానా ఫలితాల అనంతరం ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 51కి చేరింది.
జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చారిత్రాత్మకమని, గతంలో కంటే ఎక్కువ సీట్లు మరియు ఓట్లు పొందామన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందని, కాంగ్రెస్ ముక్త జమ్మూకాశ్మీర్ సాధనలో మేం విజయం సాధించామని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పార్టీ నాయకత్వ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారన్నారు కిషన్ రెడ్డి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని…
హర్యానాలో మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అంచాలన్నీ తల్లకిందులు చేస్తూ కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకుంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ దాటింది. 48 స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ బీజేపీ సూపర్ విక్టరీని అందుకుంది.
హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు.
Haryana: హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో కుండబద్ధలు కొట్టాయి. మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిద్దామని అనుకున్న బీజేపీ ఆశలపై హర్యానా ఓటర్లు నీళ్లు చల్లారు. గత పదేళ్లుగా బీజేపీ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ హర్యానాలో బలంగా పుంజుకుంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 46 కన్నా ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అన్ని సర్వేలు…
కాంగ్రెస్ వేదికపైనే మహిళా నేతకి లైంగిక వేధింపులు.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తు్న్న కార్యక్రమం సభా వేదికపైనే ఆ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు లైంగిక వేధింపులకు గురైంది. పార్టీ సీనియర్ నేత దీపేందర్ హుడా సమక్షంలోనే హర్యానా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకురాలు సెల్జా కుమారి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తాను బాధిత…
Jammu Kashmir Exit Poll 2024: జమ్మూ కాశ్మీర్‌లో ఇటు బీజేపీ కానీ, అటు ఎన్సీ- కాంగ్రెస్ కూటమి కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేవని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటుతుంటే, కాశ్మీర్‌లోయలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని సర్వేలు అంచనా వేశాయి. అయితే, మొత్తం జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 46 మ్యాజిక్ ఫిగర్. ఏ కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్‌ని సాధించలేవని సర్వేలు చెబుతున్నాయి.
Haryana Exit Poll 2024: లోక్‌సభ ఎన్నికలు -2024 తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్, హర్యానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో అందరి ఆసక్తి ఈ ఎన్నికలపై నెలకొంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెబుతోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే 46 మ్యాజిక్ ఫిగర్.…