హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.