Harry Brook Record: ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harry Brook Complete 1000 Runs in Test Cricke: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం అందుకుంది. ఆద్యంతం మలుపులు తిరుగుతూ.. ఆధిపత్యం చేతులు మారుతూ ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. చివరకు మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టుదే పైచేయిగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో స్టోక్స్ సేన 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయిన ఛేదించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హ్యారీ బ్రూక్ (75; 93 బంతుల్లో 9×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్‌ల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. 1,058 బంతుల్లో బ్రూక్ వెయ్యి పరుగులు చేశాడు. ఇదివరకు ఈ రికార్డు న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ పేరిట ఉంది. గ్రాండ్‌హోమ్ 1,140 బంతుల్లో వెయ్యి రన్స్ చేశాడు. ఈ జాబితాలో న్యూజీలాండ్ పేసర్ టిమ్ సౌథీ (1167), ఇంగ్లీష్ క్రికెటర్ బెన్ డకెట్ (1168) ఉన్నారు.
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
Also Read: Gold Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంత ఉందంటే?
మరోవైపు టెస్ట్‌ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు మాత్రం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిఫ్ పేరుపై ఉంది. సచ్లిఫ్ 12 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్ అందుకున్నాడు. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ ఎవర్టన్ వీక్స్ కూడా 12 ఇన్నింగ్స్‌లలో 1,000 రన్స్ చేశాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (13) రెండో స్థానంలో ఉండగా.. వినోద్ కాంబ్లీ (14) మూడో స్థానంలో ఉన్నాడు. లెన్ హటన్ (16), ఫ్రాంక్ వారెల్ (16), రోవ్ (16) నాలుగో స్థానంలో ఉన్నారు. యాషెస్ సిరీస్ 2023 మూడో టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్.. ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో జింబాబ్వే మాజీ ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్ సరసన నిలిచాడు.
Also Read: Insurance: వర్షాలకు కారు కొట్టుకుపోతే క్లెయిమ్ వస్తుందా?
Harry Brook becomes the fastest to reach 1,000 Test runs. (In terms of balls faced). pic.twitter.com/8BZUAUM1ye
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2023
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!