India US Trade: డొనాల్డ్ ట్రంప్ ‘‘సుంకాల’’ దెబ్బకు ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచారు. ఏప్రిల్ నుంచి ‘‘పరస్పర సుంకాలు’’ అమలు చేస్తామని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో సుంకాల తగ్గింపు, వాణిజ్యంపై భారత్, అమెరికా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తులైన హర్లే-డేవిడ్సన్ బైక్స్, బోర్సన్ విస్కీ, కాలిఫోర్నియా వైన్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తు్న్నట్లు తెలుస్తోంది.