Balmoori Venkat: కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు.
వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఎన్నికలకు ముందు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి… ఇప్పుడు సన్నరకం వడ్లకే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. రైతులను దగా చేయవద్దని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు.…
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. "ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ.
నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు.
తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్ రావు. నిరుద్యోగ…
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఆ తర్వాత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం యొక్క వివరాలను సేకరించారు.
Harish Rao:కొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్ రావు. ముప్పై…
ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ను సరఫరా చేసిందని, ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామని ఆయన తెలిపారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే…