ఒక రౌడీషీటర్ పోలీస్ కానిస్టేబుల్ ని చంపడం చాలా దురదృష్టకర సంఘటన అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు.
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామన్నారు.. కానీ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అని కుట్ర మొదలు పెట్టారన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్టాండ్‌లు కుదువ పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని ఆరోపించారు. ఏడాదికి రూ.100 కోట్లు లాభం వచ్చే విధంగా కేసీఆర్ కార్గోను తీసుకు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఆర్టీసీ…
హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసి ప్రెస్ నోట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు.