Warangal: ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారాడు ప్రియుడు. ఈ ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది కాలంగా వరుస చైన్ స్నాచింగ్‌లతో కలకలం సృష్టించాడు.