అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి జలపాతంలో కొట్టుకుపోయిన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 40 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి.. వర్షం కారణంగా కొండవాగులు పొంగిపొర్లడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.