Canada-India row: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో మొదలైన ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో ఆరోపిం�
భారత్‌కు చెందిన ఏజెంట్లకు ఖలిస్తానీ ఉగ్రవాది హత్యతో సంబంధం ఉందని సూచించడం ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు కెనడా ప్రయత్నించడం లేదని, అయితే ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించాలని కెనడా భారత్‌ను కోరుతున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు.