ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనకు రాజ్యసభ నుంచి వచ్చే జీతాన్ని రైతుల పిల్లల చదువు కోసమే ఖర్చు చేస్తానని హర్భజన్ స్పష్టం చేశాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం తన వేతనాన్ని వారికే ఇచ్చేస్తున్నానని హర్భజన్ ట్వీట్ చేశాడు. మన దేశం అభివృద్ధి చెందేందుకు తన వంతు సాయం చేస్తానని పేర్కొన్నాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా…
అందరూ ఊహించినట్లే జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా బరిలోకి దించింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా హర్భజన్ సింగ్‌ను ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్‌లో నామినేషన్ దాఖలు చేశాడు. ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించాడు. ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ కాసేపు మీడియాతో మాట్లాడాడు. క్రీడల్లో…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కొలువుదీరింది. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ క్రికెటర్ హర్భజన్‌కు రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఎమ్మెల్యే సీట్ల ప్రకారం తాజాగా ఆప్‌కు రెండు రాజ్యసభ స్థానాలు లభించే…
టీమిండియా దిగ్గజ బౌలర్ హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే హర్భజన్ త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశంపై స్వయంగా హర్భజన్ వెల్లడించాడు. తాను పుట్టిన పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయాలని భావిస్తున్నానని.. అయితే అది రాజకీయాల రూపంలోనా లేదా ఇతర రూపంలోనా అన్న విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భజ్జీ తెలిపాడు. తనకు రాజకీయ రంగం గురించి…
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కాసేపటి క్రితమే ఈ ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.…
భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కానీ ఈ లీగ్ వాయిదా పడి యూఏఈ లో ప్రారంభమైన తర్వాత మాత్రం కేకేఆర్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక తాజాగా సామాచారం ప్రకారం హర్భజన్ కోచ్ గా మారనున్నాడు అని తెలుస్తుంది. ఈ నెలలో హర్భజన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు అని సమాచారం. అయితే ఇప్పటికే…
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరుకోలేదు అనే విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ… టీం ఇండియా ఓడిపోయిన రెండు మ్యాచ్ లలో టాస్ ప్రధాన పాత్ర పోషించిందని అన్నాడు. టాస్ ఓడిపోవడం వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసిన ఆ మిగిత జట్లకు కలిసి వచ్చింది అన్నారు. అయితే ఈ మాటలను కొట్టిపారేశారు భారత సీనియర్ బౌలర్ హర్భజన్…
క్రికెట్ అంటే ఎంతో అభిమానం ఉన్న దిగ్గజ క్రికెటర్లు అప్పుడప్పుడు మాటల తూటాలు పేల్చుతూ ఏదో ఒక ఘర్షణ వాతావరణానికి కారణం అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే సోషల్ మీడియాలో .. భారత్, పాక్ మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ ట్విట్టర్ వార్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ స్పందించాడు. “షోయబ్ అక్తర్, హర్భజన్ మధ్య జరగుతున్న చర్చలోకి అమీర్ దూరడం తప్పు. అనీ అందుకు అతడు…
ఐసీసీ ప్రపంచ కప్ 2021 టోర్నీలో భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఓడిపోయింది. ఇక ఈ వచ్చే ఆదివారం తమ రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో తలపడుతుంది టీం ఇండియా. ఇక ఈ మ్యాచ్ లో జట్టు ఓపెనింగ్ పై భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొన్ని సలహాలు ఇచ్చాడు. కిసీస్ పై రోహిత్ శర్మతో పాటుగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు.…
ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీలలో భారత్, న్యూజిలాండ్ జట్లు వచ్చే ఆదివారం తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ పై భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ న్యూజిలాండ్‌తో జరిగే సూపర్ 12 మ్యాచ్ ను క్వార్టర్ ఫైనల్ అని పిలవడం అన్యాయమని హర్భజన్ బుధవారం అన్నారు. అయితే ఈ రెండు జట్లు ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలోనే ఓడిన విషయం తెలిసిందే. దాంతో ఈ మ్యాచ్…