భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కానీ ఈ లీగ్ వాయిదా పడి యూఏఈ లో ప్రారంభమైన తర్వాత మాత్రం కేకేఆర్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక తాజాగా సామాచారం ప్రకారం హర్భజన్ కోచ్ గా మారనున్నాడు అని తెలుస్తుంది. ఈ నెలలో హర్భజన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు అని సమాచారం.
అయితే ఇప్పటికే కోచ్ గా హర్భజన్ ను రెండు ఫ్రాంచైజీలు సంప్రదించినట్లు తెలుస్తుంది. తన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆ రెండు ఫ్రాంచైజీలలో ఒక్క దానికి కోచ్ గా హర్భజన్ ఒప్పందం కుదుర్చుకోనున్నాడు అని తెలుస్తుంది. అయితే ఐపీఎల్ లో మొదట ముంబై ఇండియన్స్ కు ఆడిన హర్భజన్ ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రాతినిధ్యం వచించాడు. మరి ఐపీఎల్ లో ఏ జట్టుకు హర్భజన్ కోచ్ గా మారనున్నాడు అనేది మాత్రం తెలియదు.