లెజెండ్ లీగ్ క్రికెట్2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాన్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు సాంగ్ కు చిందేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
టీమిండియా జట్టుకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుందని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సమర్థించాడు. టీమిండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిష్ నెహ్రా సరిగ్గా సరిపోతాడని హర్భజన్ సింగ్ భావిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే పొట్టి ఫార్మాట్ బాగా తెలుసు అని అన్నాడు.
Legends League Cricket: గతంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన చెంపదెబ్బ ఘటన కారణంగా టీమిండియా క్రికెటర్లు హర్భజన్, శ్రీశాంత్ మధ్య దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటన తర్వాత చాన్నాళ్లకు వీళ్లిద్దరూ ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడటం ఆసక్తి రేపింది. ప్రస్తుతం జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కారణంగా ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్భజన్, శ్రీశాంత్ నవ్వుతూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో…
Telugu Desam Party MP Ram Mohan Naidu: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగడంతో పార్లమెంట్ హాలు సందడిగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ క్రికెటర్లలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీసుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల రాజ్యసభకు పంజాబ్ కోటాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. అటు ఇప్పటికే…
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్…
సౌరవ్ గంగూలీ సారథ్యంలో హర్భజన్ సింగ్ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. తాను చాలాసార్లు విఫలమైనా, వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో అవకాశాలు కల్పించాడు. భజ్జీ కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెలరేగిపోయాడు. గంగూలీ మద్దతుతో తన సత్తా చాటుకున్నాడు. అలాంటి గంగూలీపైనే హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాను లేకపోతే గంగూలీ గెలిచేవాడు కాదని, కెప్టెన్సీ కోల్పోయేవాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాకపోతే, ఇది సీరియస్ టోన్‌లో కాదులెండి, కామెడీగానే అలా చెప్పుకొచ్చాడు. ఓ…
టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ అప్పట్లో శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన సంఘటన గుర్తుందా? ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో సీనియర్స్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న నెపంతో.. కోపాద్రిక్తుడైన హర్భజన్ లాగి ఒక్కటిచ్చాడు. ఆరోజుల్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనకు ‘స్లాప్ గేట్’ అనే ముద్ర కూడా పడింది. అప్పట్లో ఈ ఉదంతంపై హర్భజన్ పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే, ఇన్నాళ్ల తర్వాత ఆ ఘటనని గుర్తు చేసుకుంటూ ‘తాను చేసింది ముమ్మాటికీ తప్పే’నని…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు చెలరేగాలని, లేకుంటే వారికి ఇదే చివరి మెగా టోర్నీ అవుతుందని హెచ్చరించారు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ టెండూల్కర్ సైతం 100వ…
రాజస్థాన్ రాయల్స్ జట్టుపై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ విషయంలో రాజస్థాన్ జట్టు వ్యూహాలను భజ్జీ మెచ్చుకున్నాడు. గతంలో ఏ జట్టు కూడా అశ్విన్‌ను ఉపయోగించుకోని రీతిలో రాజస్థాన్ జట్టు వాడుకుందని హర్భజన్ గుర్తుచేశాడు. అశ్విన్ ఆల్ రౌండర్ సామర్థ్యాలపై విశ్వాసం చూపినందుకు ప్రతిఫలంగా ఆ జట్టు ఎంతో మేలు పొందిందని కూడా తెలిపాడు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరడంలో బట్లర్‌తో పాటు అశ్విన్‌కు కూడా…