మెగాఫోన్ పట్టి తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ బాటలో దర్శకుడు కావాలనుకున్నాడు. కానీ, అనుకోకుండా అభినయంవైపు అడుగులు వేయవలసి వచ్చింది. ఆరంభ చిత్రం ‘అల్లరి’తోనే ‘అల్లరోడు’గా జనం మదిలో నిలచిపోయాడు నరేశ్. నవతరం నటుల్లో అతి తక్కువ సమయంలో యాభై చిత్రాలు పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు ఈ అల్లరోడు. కేవలం కామెడీతో కదం తొక్కడంలోనే కాదు వీలు దొరికితే అభినయంతోనూ అలరిస్తానని పలుమార్లు నిరూపించుకున్నాడు నరేశ్. దర్శకనిర్మాత ఇ.వి.వి. సత్యనారాయణ చిన్నకొడుకుగా నరేశ్ 1982 జూన్ 30న…