మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు , అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆర్చకులు వరుణ్ తేజ్‌కు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా తన తండ్రి చిరుతో కలిసి ఆచార్య చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే ఆర్ ఆర్ఆర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మణూస్ను హత్తుకుటుంది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం గురించి ఎన్టీవీ మూడు రోజుల క్రితమే తెలిపిన విషయం తెల్సిందే.…
ఏప్రిల్ 11వ తేదీకి ఎన్టీయార్ వెండితెర నటుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నాడు. చిత్రం ఏమంటే సిల్వర్ స్క్రీన్ పైకి రావడమే రాముడి పాత్రతో వచ్చాడు ఎన్టీయార్. ఆయన తాతయ్య నటరత్న ఎన్టీయార్ సైతం రాముడి పాత్రలతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం పొందారు. ఈ బాల రాముడు సైతం అందరితోనూ భళా అనిపించుకున్నాడు. చిన్నప్పటి నుండి శాస్త్రీయ నృత్యాన్ని సైతం నేర్చుకున్న ఎన్టీయార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా కొన్ని సినిమాలలో పౌరాణిక పాత్రల్లో మెరుపులా…