యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మణూస్ను హత్తుకుటుంది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం గురించి ఎన్టీవీ మూడు రోజుల క్రితమే తెలిపిన విషయం తెల్సిందే. మునుపెప్పుడు ఇలాండి దీక్ష చేపట్టని తారక్ మొట్టమొదటిసారి హనుమాన్ దీక్షను చేపట్టాడు.
ఇక తాజాగా హనుమాన్ దీక్ష చేపట్టిన తారక్ హనుమాన్ మాలధారణలో కనిపించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాషాయ దుస్తులు.. మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమ తో తారక్ లుక్ ఆకట్టుకుంటుంది. మొదటిసారి ఈ వస్త్రధారణలో తారక్ ను చూసిన అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ప్రస్తుతం తారక్ న్యూ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ దీక్ష అనంతరం తారక్ తిరిగి సెట్స్ లోకి వెళ్లనున్నాడు. హనుమాన్ దీక్షను తారక్ ఎంతో నియమ నిబంధనలతో పూర్తిచేయనున్నారని సన్నిహితులు తెలుపుతున్నారు.