హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నక్కలగుట్ట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఘరానా లూటీ జరిగింది. పట్టపగలే సినీఫక్కీలో ఓ కారు అద్దాలు పగులకొట్టి దొంగలు రూ.25 లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే… జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి, ఆయన కుమారుడు సాయి గణేష్… బ్యాంకులో డబ్బులు డ్రా చేసి కారులో పెట్టారు. డ్రా చేసిన తర్వాత సంతకం కోసం మళ్లీ బ్యాంకుకు వెళ్లి తిరిగి వచ్చేలోపే… డబ్బులు ఎత్తుకెళ్లారని బాధితులు…