హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.