నోటి దుర్వాసన.. దీనిని హాలిటోసిస్ అంటారు. ఇది చాలామందిలో కామన్‌గా వచ్చే సమస్య. దీని వల్ల నలుగురిలో సరదాగా మాట్లాడలేం. ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం.. నోటి శుభ్రత పాటించకపోవటమే! కాబట్టి.. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవడం ప్రాథమిక పరిశుభ్రతలో ఒక భాగమని గుర్తించాలి. ఈ సమస్య రావడానికి చాలా కారణాలుంటాయి. దంతాల శుభ్రత లోపించినప్పుడు, పేగులు ఆరోగ్యంగా లేనప్పుడు, అసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నీటిని తక్కువగా తీసుకోవడం,…