శనివారం రోజున కరేబియన్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప విధ్వంసానికి వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1300 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ ఓ…