చట్టాలను అనుసరించాల్సిన అధికారులే అడ్డదార్లు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అవినీతికి పాల్పడుతున్నారు. పేదలను అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ డాక్టర్ పై వేటుపడింది. డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజుతున్న వైద్యురాలిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అవినీతి, నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు…