Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము.