GVMC Mayor: గ్రేటర్ విశాఖ పట్నం మేయర్ మార్పు నల్లేరు మీద నడకగా భావించిన కూటమి పార్టీలకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకంపై జనసేనా, టీడీపీ మధ్య పీఠ ముడి పడింది.
మేయర్ పై అవిశ్వాస తీర్మానం తర్వాత గ్రేటర్ విశాఖ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. నోటీసులు ఇచ్చేసిన కూటమి సంఖ్యాబలం కోసం మల్లగుల్లాలు పడుతోంది. లెక్క తప్పితే పరువుపోతుందనే టెన్షన్ టీడీపీలో కలవరం పెంచేస్తుంటే.. క్యాంప్ పాలటిక్స్ మొదలెట్టిన వైసీపీ.. ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని ధీమాగా కనిపిస్తోంది.
తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం. తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్…
సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.
విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కూటమి కైవసం చేసుకుంది. పదికి 10 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది.
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి, రాష్ట్రంలోని ముఖ్యమైన కార్పొరేషన్‌లు మరియు జిల్లా పరిషత్‌లపై దృష్టి సాధిస్తుంది. విశాఖపట్నం లాంటి కీలక నగరాల్లో స్థానిక సంస్థలపై పట్టు సాధించిన వైఎస్ఆర్సీపీ కేడర్‌ను నిర్వీర్యం చేయాలని ప్రణాళికలు చేస్తోంది. ప్రత్యేకంగా మేయర్ పదవిని లక్ష్యంగా పెట్టి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మరి ఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి….
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ… పది స్థానాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు.. అయితే, టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది.. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. ఈ ఎన్నికల్లో 98 డివిజన్లకు గాను 93 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.. మొత్తంగా పదికి పది స్థానాలను వైసీపీ కైవసం…
విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మరో అధునాతన ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తడి చెత్త, పొడి చెత్తల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను కాపులుప్పాడ డంపింగ్ యార్డులో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్ అధికారికంగా ప్రారంభం కాకపోయినా ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన మాత్రం కొనసాగుతోంది. ప్రతిరోజూ ఈ ప్రాజెక్టు నుంచి 15 మెగావాట్ల విద్యుత్…