GVMC Mayor: గ్రేటర్ విశాఖ పట్నం మేయర్ మార్పు నల్లేరు మీద నడకగా భావించిన కూటమి పార్టీలకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకంపై జనసేనా, టీడీపీ మధ్య పీఠ ముడి పడింది. రెండు పదవులకు ఒకేసారి నోటీసులు ఇవ్వకుండా టీడీపీ అంతర్గత ఎత్తుగడలు వేస్తోందని జనసేన పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. దీంతో అవిశ్వాసం నెగ్గించుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Padi Kaushik Reddy: 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు!
అయితే, మరోవైపు, ప్రస్తుత మేయర్ యాదవ సామాజిక వర్గం కనుక కూటమి పార్టీలు కూడా అదే వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈనెల 29వ తేదీన గ్రేటర్ విశాఖ బడ్జెట్ సమావేశం ఉంది. ప్రస్తుతం మేయర్ హరి వెంకట కుమారి.. ఇద్దరు డిప్యూటీ మేయర్లు క్యాంపులో ఉన్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు మేయర్ హాజరు అవుతారా..? లేదా అనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది.