ఏపీలో కొత్త జిల్లాల విభజనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికో న్యాయం, జిల్లా కేంద్రాల ఏర్పాటుకు మరో న్యాయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుందని ఆయన విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న అమరావతి రాజధానిగా పనికిరాదంటున్న ప్రభుత్వం… జిల్లా కేంద్రాలను మాత్రం సమదూరంలో ఉండాలనే వాదనను ఎలా తీసుకొస్తుందని నిలదీశారు. Read Also: అదొక్కటే జగన్ చేసిన మంచి పని: టీడీపీ…
అక్కడ రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నేత ఉన్నారు. కానీ.. ఆయనతో వర్కవుట్ కాదని కేడర్ అంటోందట. మళ్లీ గెలవాలంటే.. నేతను మార్చాల్సిందే అంటున్నారట. కొత్త నేత ఎవరో కూడా కేడర్ డిసైడ్ చేసిందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? కేడర్ వద్దనుకుంటున్న ఆ నాయకుడు ఎవరు? కొత్త నేతను సెట్ చేసుకుంటోన్న టీడీపీ కేడర్? గుంటూరు జిల్లా వినుకొండ. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట. వరసగా రికార్డు మెజారిటీతో గెలిచిన జీవీ…
గుంటూరు వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. శివశక్తి ఫౌండేషన్ లెక్కలతో శివయ్యస్థూపం వద్దకు రావాలని ఎమ్మెల్యే బొల్లా సవాల్ విసిరారు. అయితే బ్యాలెన్స్ షీట్లతో శివయ్య స్థూపం వద్దకు వస్తానన్న జీవీ ఆంజనేయులు.. కోటప్పకొండపై ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకున్నా తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే బొల్లా ప్రమాణం చేయాలి అని అన్నారు. ఇకనైనా తన మీద బురద చల్లడం ఎమ్మెల్యే బొల్లా మానుకోవాలని జీవీ హెచ్చరించారు.