పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనపై రాజకీయాలు చేయవద్దన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు. దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సత్తెనపల్లి ఘటన పై ప్రత్యేక దృష్టి పెట్టింది సీఎంవో.
Read Also: Nani 30: ‘మెగా’ గ్రాండ్ గా లాంచ్ అయిన నాని నెక్స్ట్ మూవీ…
విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్క సారిగా ఇంత మంది ఎందుకు అనారోగ్యం పాలయ్యారు అని దర్యాప్తు చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు. రెండు వందల మంది విద్యార్థినులు అనారోగ్యం పాలైన ఘటనలో ఎవరిని ఉపేక్షించం అన్నారు. ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు…పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రస్తుతం మా మొదటి కర్తవ్యం అన్నారు. తల్లి దండ్రులు ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు. గురుకుల పాఠశాలలో అనారోగ్యం పరిస్థితుల నేపథ్యంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీ లు ఇలాంటి ఘటనలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు…అలాంటి పనిలేని విమర్శలకు నేను స్పందించను అన్నారు అంబటి రాంబాబు.
Read Also: TSRTC: మీట నొక్కగానే.. సమస్త సమాచారం.. కొత్త సాంకేతికతతో నెట్ వర్క్ అప్ గ్రేడ్