Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్ రహమత్ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల…