Ease Of Living: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్…
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది.