office was set on fire: బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు.. అర్థరాత్రి హైడ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లాలో అర్థరాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. గుంటూరు డొంకరోడ్డులోని అనిల్ ఆఫీస్‌ను తగలబెట్టేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అర్థరాత్రి సమయంలో ఆఫీస్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు దుండగులు. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ అనిల్. అర్థరాత్రి సమయంలో ఆఫీస్ లోకి చొరబడ్డ దుండగులు పెట్రోల్ చల్లారు. అనంతరం నిప్పు పెట్టి అక్కడినించి పారిపోయారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయింది. అయితే, ఈఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Vizag Capital: చకచకా విశాఖకు జగన్.. మార్చినుంచి అక్కడే మకాం
Also Read
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ఎవరూ లేని సమయంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించి తనపై దాడి చేసినట్టు అక్కడి వాచ్ మెన్ ఆరోపిస్తున్నాడు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం బొరుగడ్డ అనిల్ కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తు్న్నారు. రెండురోజుల క్రితం బోరుగడ్డ అనిల్ కుమార్ కోటంరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కోటంరెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి కాలి గోటి మట్టితో సమానం అని వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోసం చంపడానికైన చావడానికైన సిద్ధమని ప్రకటించారు.. ఇక, చంద్రబాబు తన బినామీ సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ వేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఎవరు నాయకుడో, ఎవరు మోసం చేసారో అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్నారు బోరుగడ్డ అనిల్ కుమార్. నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వీరాభిమానిని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై అవాకులు చవాకులు పేలితే , కోటంరెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డున ఈడ్చుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక, టికెట్లు దక్కవని తెలిసిన నాయకులే ఇలాంటి అసమ్మతి నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు బోరుగడ్డ అనిల్ కుమార్.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!