YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్…
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం వద్దకు వచ్చిన ఒక వర్గానికి చెందిన సర్పంచి భర్త ఆళ్ల శ్రీను. రెండో వర్గానికి చెందిన దాసరి శ్రీశైలం సైతం సమావేశం వద్దకు వెళ్లడం వివాదానికి దారితీసింది. సమావేశానికి బయట వ్యక్తులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు వార్డు సభ్యులు. దీంతో చెలరేగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ బయటకు వచ్చాక రెండు వర్గాల మహిళా వార్దు సభ్యుల…