గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో…