మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత…
గుంటూరు కారం… ఈసారి తగ్గేదేలే అని మ్యాడ్ సినిమా ప్రమోషన్లో గట్టిగా చెప్పాడు నిర్మాత నాగవంశీ. ఫస్ట్ సింగిల్ రెడీ అయింది… ఇప్పటికే తమన్ సాంగ్ కొట్టేశాడు… దసరాకు అప్డేట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. దీంతో దసరా రోజు డబుల్ ధమాకా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు మాత్రం మాట తప్పినట్టుగానే ఉంది వ్యవహారం. ఎందుకంటే… మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన అప్డేట్ అలా ఉంది మరి. ‘గుంటూరు కారం’ సాంగ్…